తాండూరు, ఏప్రిల్ 16 : సీఎం కేసీఆర్‌తో దేశం అభివృద్ధి, పేదల సంక్షేమం సాధ్యమని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పెద్దేముల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఆ పార్టీ మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ అధ్యక్షతనలో సంబురంగా జరిగింది. పెద్దేముల్ మండల పరిధిలోని 37 గ్రామపంచాయతీల నుంచి వేలాది మంది కార్యకర్తలు ప్రత్యేక వాహనాలల్లో బ్యాండ్లు, డప్పుల దరువులతో ఉత్సాహంగా పటాకులు కాలుస్తూ తరలివచ్చారు. కళాకారుల ఆటపాటలు, కార్యకర్తల ఉల్లాసంతో పాటు గులాబీ శ్రేణుల నినాదాలు, ప్రజా ప్రతినిధుల మాటలతో ఆత్మీయ సమ్మేళనం ఆకట్టుకుంది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరుతున్నాయన్నారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టడంతో పాటు దర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లేనిపోని ఆరోపణలు చేస్తుందని విమర్శించారు. తెలంగాణతోపాటు తాండూరులో ముందెన్నడూ జరుగని అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరారు. తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విజన్‌తో పేదల కష్టాలు దూరం అవుతున్నాయన్నారు. తాండూరు నియోజకవర్గంలో గడపగడపకూ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు.
Rr2
మహిళల కష్టాలు తీర్చడం కోసం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరు, అర్హులైన పేదలకు ఆసరా పింఛన్లు ఇస్తున్నామన్నారు. పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు కార్పొరేట్‌కు ధీటుగా వైద్యసేవలు, విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించేందుకు గురుకులాలు, మోడల్ స్కూల్‌తో పాటు ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి సహకారంతో తాండూరుకు ప్రత్యేక నిధులు తీసుకువచ్చి రూపురేఖలు మారుస్తున్నట్లు తెలిపారు. గతపాలకుల హయాంలో అస్తవ్యస్తంగా ఉన్న తాండూరు ఇప్పుడు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు.
జిల్లా గ్రంథాలయం చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ బీజేపీతో బతుకులు బజారున పడుతాయని, కాంగ్రెస్‌తో కష్టాలు వస్తాయని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు గ్రామాల్లోకి వస్తే ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పర్యాద కృష్ణమూర్తి, ఎంపీపీ అనురాధ, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, కోట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్, ఎంపీటీసీ సంఘం అధ్యక్షుడు ధన్సింగ్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు జనార్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు రమేశ్, వెంకటేశ్‌చారి, నారాయణరెడ్డి, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.