తుర్కయంజాల్,ఆగస్టు 12 : రైతుల శ్రేయస్సే ధ్వేయంగా సహకార సంఘాలు పని చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి కొహెడలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘానికి కేటాయించిన భూమిలో నిర్మించిన గోదాములను మంగళవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్యతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. రైతుల శ్రేయస్సే ధ్వేయంగా సహకార సంఘాలు పని చేయాలని సూచించారు. గోదాముల ద్వారా రైతులు తమ పంట ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేసుకోవడంతో పాటుగా నాణ్యమైన ధరలకు పంట ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం ఉంటుదని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, డైరెక్టర్లు సంజివరెడ్డి, యాదగిరి, కృష్ణారెడ్డి, స్వప్న, చెక్క లక్ష్మమ్మ, శీలం లక్ష్మమ్మ, సంఘం సీఈఓ రాందాస్ తదితరులు పాల్గొన్నారు.