పరిగి, జూలై 21: రెండు రోజులుగా తెరిపి లేకుండా కురుస్తు న్న వర్షాలతో పరిగి మండలంలోని చెరువులు, కుంటలలోకి పెద్ద మొత్తంలో వరద నీరు చేరింది. వర్షాల వల్ల వాగులన్నీ వరద నీటితో ప్రవహిస్తున్నాయి. పరిగి మండలంలో 51 చెరు వులుండగా 37 కుంటలు నీటితో నిండాయి. లఖ్నాపూర్ ప్రాజె క్టులోకి సైతం పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. లఖ్నా పూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 18 అడుగులు ఉండగా 12 అడుగుల మేరకు వరద నీరు వచ్చి చేరింది. ఇంకా వరద ప్రవా హం కొనసాగుతుండడంతో శనివారం నాటికి లఖ్నా పూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీటితో నిండి అలుగు పారే అవ కాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలావుండగా మండ లంలోని చెరువులన్నింటిలోకి పెద్ద మొత్తంలో నీరు చేరగా షోండేపూర్ పెరుమాళ్ల చెరువుకు గండి పడింది. గండిని పూడ్చేందుకు సంబంధించి పనులు చేపట్టనున్నట్లు నీటి పారు దల శాఖ అధికారులు తెలిపారు. పరిగి నుంచి వికారాబాద్ రూట్లో గల వాగులో వర్షాలతో వచ్చిన వరద నీటిని శుక్రవా రం ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం మండ లం లోని షోండేపూర్ పెరుమాళ్ల చెరువుకు పండిన గండిని ఎమ్మెల్యే పరిశీలించారు.కార్యక్రమంలో ఎంపీ పీ కరణం అరవిందరావు, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, బీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, ప్రవీణ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
తాండూరు: తాండూరు నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండి జలకళను సంతరించుకున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో ఇరిగేషన్ శాఖ అధీనంలోని 252 చెరువులు, కుంటల్లో నీరు నిండుగా చేరింది. శుక్రవారం తాండూరు కాగ్నానది, యాలాల పరిధిలోని కాకరవాణి నదితో పాటు జుంటుపల్లి, శివసాగర్ ప్రాజెక్టులు నిండి అలుగు పారుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం లోకి వచ్చిన వెంటనే మిషన్ కాకతీయ పథకంతో చెరువులు పూడికతీయడం, నీళ్లు వృథాగా పోకుండా కట్టలకు మట్టి వేయడం చేశారు. అలాగే ఇరిగేషన్ శాఖలో ప్రక్షాళన చేపట్టి ప్రాజెక్టులు, చెక్‌డ్యాం నిర్మాణాలకు ప్రత్యేక నిధులు కేటా యించి నీటి నిలువ కోసం నిర్మాణాలు చేపట్టారు. గత సం వత్సరంతో పాటు ఈ ఏడాది భారీగా కురిసిన వర్షాలతో నీరు వృథాగా పోకుండా ఎక్కడి నీరు అక్కడే నిలవడంతో జలకళ సంతరించుకుంది.
బొంరాస్‌పేట : బొంరాస్‌పేట మండలంలోని ఏర్పుమళ్ల కాకర వాణి ప్రాజెక్టు వర్షాలకు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారు తున్నది. అలుగు నుంచి వచ్చే వరద నీరు బొంరాస్‌పేట పెద్ద చెరువులోకి వచ్చి చేరుతున్నది. భారీ వర్షాలకు మెట్లకుంట, బురాన్‌పూర్, కొత్తూరు, తుంకిమెట్ల, బొంరాస్‌పేట చెరువు ల్లోకి వరద నీరు వస్తున్నది. కాకరవాణి వాగులో నీటి ఉధృతి పెరగడంతో మహంతిపూర్ గ్రామస్తులకు మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్సై శంకర్ వాగును పరి శీలిం చి ప్రజలు ఎవరూ వాగును దాటొద్దని సూచించారు. వడిచెర్ల గ్రామంలో కృష్ణ అనే వ్యక్తి ఇంట్లోకి వరద నీరు చేరడంతో ఎస్సై శంకర్, ఆర్ఐ రవిచారి గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యు లను మరో ఇంట్లోకి తరలించారు. ఇంటిముందు నిలిచిన వరద నీటిని జేసీబీ సహాయంతో తొలగించారు. భారీ వర్షాలకు పలు గ్రామాల్లో ఇండ్లకు పాక్షికంగా నష్టం జరిగింది. ఇదిలా ఉండగా బొంరాస్‌పేట మండలంలో 83.80 మి.మీ, దుద్యాల మండలంలో 105.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏర్పు మళ్ల కాకరవాణి ప్రాజెక్టు అలుగు నుంచి బొంరాస్‌పేట పెద్ద చెరువులోకి వరద నీరు వచ్చే ఏటి కాలువకు గండి పడింది. నీరంతా వృథాగా వెళ్తుండడంతో వైస్ ఎంపీపీ శ్రావణ్‌గౌడ్, రైతులు వెళ్లి జేసీబీల సహాయంతో గండిని పూడ్చారు.
కొడంగల్: మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. కాల్వల వద్ద పారుతున్న నీటి ప్రవా హానికి వలలు వేసి చేపలు పట్టడంతో సందడి నెలకొంది. మం డలంలోని ఖాజాఅహ్మద్పల్లిలోని చిట్లపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. శుక్రవారం గ్రామ సర్పంచ్ జేసీబీతో వాగులో పేరుకుపోయిన చెత్తను తీసివేయించాడు. కొడంగల్ పెద్ద చెరువుకు నీటి ప్రవాహం పెరిగి అలుగు పారే స్థాయికి చేరుకుం టున్నది. పాతకొడంగల్ గ్రామ శివారులోని మంగలికుంట నిండుకొని పంట పొలాల్లోకి నీరు చేరింది. ఎడతెరపిలేని వర్షాలతో మున్సిపల్, మండల పరిధిలో శిథిలావస్థకు చేరు కున్న ఇండ్లు కూలాయి.
పెద్దేముల్ : మండల పరిధిలోని మారేపల్లి తండా గ్రామంలో ఐదు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిని కూలిపోయాయి. బాధితు లను అధికారులు, సర్పంచ్ పాండు నాయక్‌లు పరా మర్శిం చారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు ఇందూరు గ్రామంలోకి ఎగువ నుండి వరదనీరు పెద్ద మొత్తంలో చేరింది. గాజీపూర్ గ్రామ సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహించడంతో తాండూరు-సంగారెడ్డి రాకపోక లు పూర్తిగా స్తంభించాయి. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మప్ప, మాజీ సర్పంచ్ సంతోష్ నాయక్, పంచాయతీ కార్యదర్శి కార్తీక్, వి.శ్రీనివాస్ పాల్గొ న్నారు.
దోమ: దోమ పెద్ద చెరువు నిండి మత్తడి పోస్తున్నది. చెరువు నిండి అలుగు పారు తుండటంతో మత్స్యకారులు చేపలు దిగు వకు వెళ్లకుండా కంచె ఏర్పాటు చేస్తున్నారు. చెరువు మత్త డిని చూసేందుకు ఆయా గ్రామాల ప్రజలు వస్తున్నారు. చెరువు నిండి పారుతుండడంతో రెండు పంటలు సాగు చేసుకో వచ్చని ఆయకట్టుదారు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయినా పూర్ పెద్ద చెరువు, దాదాపూర్ చెరువుతో పాటు ఆయా గ్రా మాల్లోని చెరువులకు వరద ఉధృతి కొనసాగుతున్నది.
ధారూరు: దోర్నాల్-ధారూరు స్టేషన్ (కాగ్నా)వాగు పొంగి పొర్లుతున్నది. దీంతో తాత్కాలిక వంతెన దెబ్బతిన్నది. దోర్నా ల్, అంపల్లి, గురుదోట్ల, నాగారం, కుమ్మరిపల్లి, దోర్నాల్ తం డా తదితర గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్ప డింది. ఎబ్బనూర్ చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతున్నది.
బంట్వారం: నిరంతరంగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని ఎంపీడీవో బాలప్ప పేర్కొన్నారు. శుక్ర వారం మండలంలోని పలు గ్రామాల వాగులను ఆయన సందర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లు ఉంటే వెంటనే ఖాళీ చేసి, అవసరమైతే స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ, పాఠశాలల భవనాల్లో ఉండాలని చెప్పారు. నీటిని వేడి చేసి, చల్లార్చి తాగాలని చెప్పారు. . ఈయన వెంట సిబ్బంది షఫీ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
మర్పల్లి: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.. కొత్లాపూర్‌లో రెం డు, కోటమర్పల్లిలో రెండు, గుర్రంగట్టు తండాలో ఒక ఇల్లు కూలిపోయాయి. మర్పల్లి నుంచి కోటమర్పల్లి వెళ్లే రోడ్డుకు బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్నది. పలు గ్రామాల్లో పంట పొలాల్లో నీళ్లు నిలిచాయి.
మోమిన్‌పేట: మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో చిలుకవాగు ఉరకలేస్తుండడంతో ఎన్కతల నుంచి టేకులపల్లి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పత్తి, మక్కజొన్న, కూరగాయ పంటలు నీట మునిగాయి.