బీఆర్ఎస్ ఆశయాలను గడపగడపకూ తీసుకెళ్లాలి
బీఆర్ఎస్ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం చౌడాపూర్ మండల పరిధిలోని మరికల్ గ్రామ పంచాయతీ పరిధిలో పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, పార్టీ ఆశయాలను గడపగడపకు తీసుకెళ్లాలన్నారు
- ఆత్మీయ సమ్మేళనంలో పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి
కులకచర్ల, జనవరి 4: బీఆర్ఎస్ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం చౌడాపూర్ మండల పరిధిలోని మరికల్ గ్రామ పంచాయతీ పరిధిలో పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, పార్టీ ఆశయాలను గడపగడపకు తీసుకెళ్లాలన్నారు. మనరాష్ట్ర సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాలు పేరు మార్చి అమలు చేస్తున్నాయని వివరించారు.
రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఇతర రాష్ర్టాల ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో చేర్చాలని కోరుతున్నారన్నారు. డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు పార్టీని మరింతగా అభివృద్ధి చేసేందుకు సైనికుల్లా పనిచేయాలన్నారు. ప్రతి ఒక్కరికి పథకాలు దరిచేసేందుకు కృషిచేయాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొప్పుల అనిల్‌రెడ్డి, ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ హరికృష్ణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్తినేని సుధాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింహ యువజన విభాగం నాయ కుడు మందిపల్ వెంకట్, మేగ్యానాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

