కడ్తాల్, జనవరి 4 : ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కేశవరెడ్డి గార్డెన్స్‌లో తహసీల్దార్ ముంతాజ్ అధ్యక్షతన నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే ధ్యేయమని తెలిపారు.
గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడే నాయకులు రాజకీయాలు చేయాలని అనంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలన్నారు. అనంతరం కడ్తాల్ మండలంలో 35, తలకొండపల్లి మండలంలో 70, ఆమనగల్లు మండలంలో 11 మంది లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, వైస్ ఎంపీపీ ఆనంద్, తహసీల్దార్లు ముంతాజ్, రంగారెడ్డి, లలిత, ఎంపీడీవో రామకృష్ణ, డీటీ వినోద్‌కుమార్, సీఐ శివప్రసాద్, ఎస్ఐ హరిశంకర్‌గౌడ్, సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహారెడ్డి, తులసీరాంనాయక్, సులోచన, కమ్లీ, భారతమ్మ, శంకర్, రాములునాయక్, హంశ్యా, శ్యాంసుందర్‌రెడ్డి, కుమార్, ఎంపీటీసీలు గోపాల్, లచ్చిరాంనాయక్, శ్రీనివాస్‌రెడ్డి, రాములుగౌడ్, మంజుల, నిర్మల తదితరులు పాల్గొన్నారు.