శంకర్పల్లి : నిత్యం నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం, నూతన ఆవిష్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలపై ముందుకు వెళ్తామని చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య అన్నారు. శంకర్ పల్లి మండలం రావులపల్లి గ్రామంలో రెండుకోట్ల యాభై లక్షల నిధులతో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు, సంకేపల్లి గ్రామంలో యాభై ఐదు లక్షల నిధులతో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ రోడ్ల నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించి, త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.