కడ్తాల్, ఫిబ్రవరి 4 : ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన ఓంకార్‌కి రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును శనివారం హైదరాబాద్‌లో తన నివాసంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని, కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి నిధులు కేటాయించకపోవడం అన్యాయమని విమర్శించారు. అదే విధంగా సాలార్‌పూర్ గ్రామానికి చెందిన రవీందర్‌కు రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును జడ్పీటీసీ దశరథ్‌నాయక్ అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, డైరెక్టర్ లాయక్‌అలీ, సర్పంచ్ యాదయ్య, ఎంపీటీసీ ప్రియ, నాయకులు మహేశ్, నర్సింహ, శ్రీను, సోమ్లా, శ్రీకాంత్, జగన్, రంగా, నిరంజన్, భాస్కర్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి.. పేదలకు వరం -ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్
షాద్‌నగర్‌టౌన్ : సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరంలా మారిందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటీ క్రిస్టియన్కాలనీకి చెందిన మోహన్‌రెడ్డికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 60వేల చెక్కును శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయనిధి ద్వారా ఆపదలో ఉన్న పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, నాయకులు పాల్గొన్నారు.