ప్రొసీడింగ్‌ను జడ్పీటీసీ శ్రీలతతో కలిసి అందజేసిన ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
కొత్తూరు, ఏప్రిల్ 29: కొత్తూరు మండలాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. రూ. 55 లక్షల జడ్పీ నిధుల ప్రొసీడింగ్‌ను కొత్తూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీలతతో కలిసి ఆయా గ్రామాల సర్పంచ్‌లకు శనివారం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నిధులతో మండలంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. తమ మండలానికి రూ. 55 లక్షల జడ్పీ నిధులు కేటాయించడంపై కొత్తూరు జడ్పీటీసీ శ్రీలత ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రూ. 55 లక్షల్లో సిద్ధాపూర్ స్కూల్ కంపౌండ్ వాల్‌కు రూ. 4 లక్షలు, మహిళా సమాఖ్య భవనానికి రూ. 10 లక్షలు, కొడిచెర్లలో సీసీ రోడ్డుకు రూ. 5 లక్షలు, కొడిచెర్ల తండాలో డ్వాక్రా భవనానికి రూ. 10 లక్షలు, పెంజర్లలో సీపీ రోడ్డుకు రూ. 6 లక్షలు, ఎస్బీపల్లిలో సీసీ రోడ్డుకు, 5 లక్షలు, అలాగే అంగన్వాడీ భవనానికి రూ. 10లక్షలు, గూడూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ. 5 లక్షలు కేటాయించారని జడ్పీటీసీ శ్రీలత తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శోభ, సర్పంచ్‌లు జంపుల సంతోష్‌నాయక్, వడ్డె తులసమ్మ, బ్యాగరి సత్తయ్య, అజయ్‌నాయక్, మామిడి వసుంధరమ్మ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మెండె కృష్ణయాదవ్, నాయకులు ఎమ్మె సత్యనారాయణ పాల్గొన్నారు.
షాద్‌నగర్‌టౌన్ : పేద ప్రజల ఆరోగ్యంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలం కొండన్నగూడ గ్రామానికి చెందిన వంశీయాదవ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. లక్షా 50వేల ఎల్వోసీ చెక్కును శనివారం వంశీయాదవ్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పేద ప్రజలకు సీఎం సహాయనిధి ద్వారా కార్పొరేట్‌స్థాయిలో వైద్యం అందుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్‌యాదవ్, నాయకులు పాల్గొన్నారు.