కందుకూరు, సెప్టెంబర్ 6: దేశం మొత్తం సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నదని.. ఆయన పాలన దేశమంతా కొనసాగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం మండలంలోని లేమూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అగర్మియగూడ, లేమూరు, సరస్వతీగూడ, బైరాగిగూడ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పింఛ న్ కార్డుల పత్రాలను ఆమె పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గడపగడపకూ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని.. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే పథకాలను ప్రవేశ పెడుతున్నారని స్పష్టం చేశారు. ఆయన మనస్సున్న మహారాజు అని, నిరంతరం పేదల సంక్షేమం కోసమే పనిచేస్తున్నారని కొనియాడారు. కేసీఆర్ పాలనను చూసి ప్రతిపక్ష పార్టీల నాయకులు భయపడుతున్నాయని.. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను చూసి ఓర్వలేక లేని పోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై విమర్శలు మానుకోకపోతే ప్రజ లే గుణపాఠం చెబుతారన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనే త, గీత కార్మికులకు ప్రతినెలా పింఛన్లు అందుతున్నాయని మంత్రి సబితారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, గ్రం థాలయ సంస్థ చైర్మన్ పాండురంగారెడ్డి, జడ్పీటీసీ జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, వైస్ చైర్మన్ విజేందర్‌రెడ్డి ,ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ లతాబాబురావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పరంజ్యోతి, భూపాల్‌రెడ్డి, రాము, గోపాల్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, జ్యోతీశేఖర్గుప్తా, సాయిలు, శ్రీనివాస్, శేఖర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌లు కొండల్‌రెడ్డి, కవిత, ఎంపీటీసీ యాదయ్య, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు జయేందర్, మహేందర్‌రెడ్డి, మేఘనాథ్‌రెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, లచ్చానాయక్, ఈశ్వర్‌గౌడ్, దశరథ, సత్యనారాయణ, దీక్షిత్‌రెడ్డి, సామయ్య, తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీవో వెంకట్రాములు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.