అంతర్జాతీయ ప్రమాణాలతో 167ఎకరాల్లో కొహెడ పండ్ల మార్కెట్‌ను నిర్మించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో పాటు పలువురు మార్కెటింగ్ శాఖ అధికారులతో కలిసి ఆయన కొహెడ పండ్ల మార్కెట్‌ను పరిశీలించడంతో పాటు డీపీఆర్ రిపోర్టును పరిశీలించి మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆమోదం లభించగానే సంక్రాంతి తర్వాత మార్కెట్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మార్కెట్ నిర్మాణంపై డీపీఆర్ తుదిదశకు చేరుకున్నదని, ప్రభుత్వ ఆమోదం రాగానే టెండర్లను పిలువనున్నట్లు వివరించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక ప్రమాణాలతో షెడ్లు, గోదాములను నిర్మిస్తామన్నారు. ప్రపంచస్థాయిలో ఉన్న ప్రధాన మార్కెట్లకు దీటుగా కొహెడ మార్కెట్ నిర్మాణం ఉంటుందని, రాష్ర్టానికే తలమానికంగా ఈ మార్కెట్ నిలువనున్నదని మంత్రి పేర్కొన్నారు.
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 11: ప్రపంచంలోనే అ త్యంత గుర్తింపు పొందిన మార్కెట్లకు దీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో కొహెడ పండ్ల మార్కెట్‌ను నిర్మించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంప ట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పలువురు మా ర్కెటింగ్‌శాఖ అధికారులతో కలిసి ఆయన కొహెడలోని పండ్ల మార్కెట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ డీపీఆర్ రిపోర్టును పరిశీలించి మా ట్లాడారు. పండ్ల మార్కెట్‌కు సంబంధించిన డీపీఆర్ ను సిద్ధం చేశామని.. త్వరలోనే సీఎంకు సమర్పించి మార్పులు, చేర్పులు ఉంటే సవరిస్తామన్నారు.
ఆయన ఆమోదం లభించగానే టెండర్లను పిలిచి సం క్రాంతి తర్వాత మార్కెట్ పనులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామన్నారు. ఇం దుకోసం ఇప్పటికే మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన మార్కెట్లకెళ్లి అక్కడ ఉన్న ప్రమాణాలను పరిశీలించి వచ్చారని.. ఇక్కడా అదే రీతిలో నిర్మించి అంతర్జాతీయస్థాయిలో ఎగుమతులు జరిగేలా చూస్తామన్నారు. రైతు లు నేరుగా తమ ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించుకునేలా ట్రేడర్స్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నా రు. ఇప్పటికే పండ్లమార్కెట్లో ఉన్న ట్రేడర్స్తోపా టు కొత్తగా మరి కొంతమంది ట్రేడర్స్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, అలాంటి వారికి కూడా అవకాశం కల్పించేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు.
ఔటర్ రింగ్‌రోడ్డుకు అతి సమీపంలో కొహెడ వద్ద నిర్మిస్తున్న పండ్ల మార్కెట్‌కు దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా తమ పండ్లను తీసుకొచ్చి విక్రయించుకునేందుకు అవసరమైన రహదారుల సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో సీతాఫలం, బత్తా యి, మామిడి వంటి దిగుమతులు అధికంగా వస్తాయని వాటిని రైతుల నుంచి సేకరించి విదేశాలకు ఎగుమతి చేసేలా ఈ మార్కెట్లో కోల్డ్ స్టోరేజీల నిర్మాణం జరుగుతుందన్నారు. ఔటర్‌రింగ్‌రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డుతోపాటు విమానాశ్రయం కూడా ఈ మార్కెట్‌కు అనుసంధానం చేస్తామన్నారు. భవి ష్యత్తు అవసరాల రీత్యా నిర్మిస్తున్న మార్కెట్‌తో ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు రాన్నదన్నారు.
167 ఎకరాల్లో ..
కొహెడ వద్ద 167 ఎకరాల్లో నిర్మిస్తున్న పండ్ల మా ర్కెట్లో అత్యాధునిక ప్రమాణాలతో కూడిన షెడ్లు, గోదాములను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపా రు. ముఖ్యంగా శాశ్వత నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఒక్కొక్క షెడ్డును రెండు లక్షల చదరపు అడుగుల సామర్థ్యంతో మొత్తం ఎనిమిది షెడ్లను ఇక్కడ నిర్మిస్తామన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న టాప్ మార్కెట్లల్లో ఉన్న వసతులను ఇక్కడ కల్పించాలని యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు.
అలాగే, మార్కెట్‌కు వచ్చే రైతులకూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పిస్తామన్నారు. పండ్ల మార్కెట్లో రెండు పెట్రోల్, డీజిల్ పంపులు, ట్రేడర్లు, పండ్ల మార్కెట్‌కు అవసరమైన రీతిలో 132/11కేవీ సబ్స్టేషన్లు, ధర్మకాంటలను ఏర్పాటు చేస్తామన్నారు. పండ్లను నిల్వ ఉంచేందు కు ప్లాంట్లను నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు డైరెక్టర్ లక్ష్మణుడు, డీసీసీబీ వైస్‌చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, పలువురు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.