ఆదిబట్ల, జూలై 30 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ హయాంలో ప్రతి కులానికి న్యాయం జరుగుతున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మరియాపురం, ఇందిరమ్మకాలనీకి చెందిన పలు పార్టీల నుంచి దాదాపు 200 మంది కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఆదిబట్ల మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుడు పల్లె గోపాల్‌గౌడ్ అధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వారికి శాలువాలు కప్పి ఆహ్వానించారు. రాష్ట్రం, సీఎం కేసీఆర్ దేశంలోనే నం.1 స్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్, బీసీ, మైనార్టీలకు లక్ష రూపాయల రుణం, దళితులకు దళిత బంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలు ప్రవేశపెట్టి నేడు ప్రతి కులానికి న్యాయం చేస్తున్నారని తెలిపారు.
దివ్యాంగులకు పింఛన్ పెంచి చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రతి మున్సిపాలిటీకి కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేశామన్నారు. ఎంతో మంది రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రతి ఇంటికి నేడు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చేరాయన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు జంగయ్య, నాయకులు జంగయ్య, శ్రీనివాస్‌గౌడ్, రాజు, అమరేందర్, జయగౌడ్ పాల్గొన్నారు.
Rr4
సంక్షేమ పథకాలకు ఆకర్షితులై..
శంకర్పల్లి జూలై 30 : ప్రభుత్వం అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగాపురం వార్డుకు చెందిన 52 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం ప్రతి కార్యకర్త సైనికుడివలే పనిచేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గడపగడపకు తెలియపరచాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందాయని పేర్కొన్నారు.
దేశంలోని ఇతర రాష్ర్టాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చేసుకుంటున్నాయన్నారు. 9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో 60 సంవత్సరాల అభివృద్ధి జరిగిందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నదని తెలిపారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కొత్త బిచ్చగాడు పొద్డెరగడు అన్నట్టు ప్రతి పార్టీ నాయకులు మీ ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేస్తారని.. వారి మాటలను విని మోసపోవద్దని.. అభివృద్ధికే మళ్లీ పట్టం కట్టాలని కోరారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాపారావు, మున్సిపల్ యూత్ అధ్యక్షుడు పాండురంగారెడ్డి, నాయకులు ప్రవీణ్‌కుమార్, బాలకృష్ణ, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.