Commercial Cylinders | కమర్షియల్ సిలిండర్లపై కన్నేసిన యువకులు.. టిఫిన్ సెంటర్‌పై దాడి చేసి మరీ ఎత్తుకెళ్లారు
Commercial Cylinders | ఓ వైపు గ్యాస్ కొరత.. మరోవైపు కమర్షియల్ సిలిండర్ల ధర పెరుగడంతో ఈజీ మనీ కోసం ఆకతాయిలు దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి.
Commercial Cylinders | కొంతకాలంగా పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో ముడిచమురు, సహజవాయువు (LNG)రవాణా మార్గాల్లో తీవ్ర ఇబ్బందులు ఏర్పడగా.. తద్వారా వాటి ధరలు భారీగా పెరిగాయి. ఓ వైపు గ్యాస్ కొరత.. మరోవైపు కమర్షియల్ సిలిండర్ల ధర పెరుగడంతో ఈజీ మనీ కోసం ఆకతాయిలు దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి.
తాజాగా కమర్షియల్ సిలిండర్లపై కన్నేసిన కొందరు యువకులు చెలరేగిపోయారు. టిఫిన్ సెంటర్ నిర్వాహకులపై దాడి చేసి మరీ గ్యాస్ సిలిండర్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. కొందరు యువకులకు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని డీపీ కాలనీలో ఉన్న ఓ టిఫిన్ సెంటర్లో ఉన్న కమర్షియల్ సిలిండర్లపై కన్ను పడ్డది. ఇంకేంటి వాటిని ఎలాగైనా ఎత్తుకెళ్లాలని ప్లాన్ చేసిన యువకులు సదరు టిఫిన్ సెంటర్ సిబ్బందిపై దారుణంగా దాడి చేసి 3 కమర్షియల్ సిలిండర్లను ఎత్తుకెళ్లారు.
దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బస్తీలోని ఆకతాయిల ముఠాల వల్ల నరకయాతన అనుభవిస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజ్
టిఫిన్ సెంటర్ పై దాడి చేసి కమర్షియల్ సిలిండర్లు ఎత్తుకెళ్లిన దుండగులు
హైదరాబాద్ – జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని డీపీ కాలనీలో ఉన్న ఓ టిఫిన్ సెంటర్ సిబ్బందిపై దారుణంగా దాడి చేసి, 3 కమర్షియల్ సిలిండర్లు ఎత్తుకెళ్లిన యువకులు
బస్తీలోని ఆకతాయిల ముఠాల వల్ల… pic.twitter.com/bdfGm9oXpG
— Telugu Scribe (@TeluguScribe) May 25, 2026
Read Also :
KTR | అధైర్యపడొద్దు.. అండగా నిలుస్తాం.. మళ్లీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే: కేటీఆర్
Petro prices | పెట్రోల్, డీజిల్ ధరలు మరో రూ.20 పెరగనున్నాయా..?
Rakshitha Suresh | ‘హల్లల్లల్లో’తో హాట్ టాపిక్‌గా మారిన సింగర్.. ‘పెద్ది’ పాటతో హాట్ టాపిక్‌గా మారిన రక్షిత సురేష్!
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

