Uppal Narapally Corridor | పీర్జాదిగూడ, జూలై 16 : వరంగల్ జాతీయ రహదారిలోని చౌరస్తా నుంచి నారపల్లి వరకు జరుగుతున్న ఆరు లైన్ల కారిడార్ రోడ్డు పనులను పూర్తిచేసి ప్రజలకు దసరా నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర భవనాల, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం పీర్జాదిగూడలో జరుగుతున్న కారిడార్ రోడ్డు పనులను మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కారిడార్ పనులు ప్రారంభించి 8 సంవత్సరాలు గడుస్తుందని, ఫ్లైఓవర్ పనుల్లో ఆర్థిక ఇతర కారణాలతో జాప్యం జరిగిందన్నారు. ఏదేమైనా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేయడం జరిగిందన్నారు. వచ్చే దసరా నాటికి ఫ్లైఓవర్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి కారిడార్ పనుల జాప్యంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. నగరంలోని పీవీ ఎక్స్ ప్రెస్ హైవే తర్వాత 8 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఆరులైన్ల ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, బీర్లు ఐలయ్య, ఆర్ అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prada | చెప్పుల ప్రదర్శనతో వివాదం వేళ.. కొల్హాపూర్ని సందర్శించిన ప్రాడా ప్రతినిధుల బృందం
Viral video | లిఫ్టులో గ్యాంగ్ వార్.. తప్పతాగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు.. చెంపదెబ్బలు..!
KCR | ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మృతిపట్ల కేసీఆర్ సంతాపం