మేడ్చల్, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా పూడుర్లో నిర్మించనున్న ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో మంగళవారం టీఆర్ఎస్ పార్లమెంట్ మల్కాజిగిరి ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి సమావేశమయ్యారు. ఇటీవలే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏర్పాటుకు రూ.5 కోట్ల నిధులు మంజూరైన విషయం విదితమే. దీంతో ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటుకు త్వరలోనే టెండర్లను ఆహ్వానించే విధంగా చర్యలు తీసుకోవాలని మర్రి రాజశేఖర్రెడ్డి మంత్రిని కోరారు. రైతుల ఆర్థిక అభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ మంజూరీకి కృషి చేసిన మంత్రి నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.