కుత్బుల్లాపూర్, అక్టోబర్1 : సీనియర్ సిటిజన్ నేటి తరానికి ఆదర్శణీయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. జీడిమెట్ల డివిజన్ కుత్బుల్లాపూర్ గ్రామంలో సీనియర్ సిటిజన్ కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుడారు.
నేటి తరం ఇంట్లోని వయోవృద్ధులను భారంగా కాకుండా వారితో ప్రేమగా ఉన్నట్లయితే జీవితంలో ఆటుపోట్లను ఎలా ఎదుర్కోవాలో వారి నుండి తెలుసుకొని బంగారు భవిష్యత్‌ను రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ కుత్బుల్లాపూర్ అధ్యక్షులు ఎస్.నరసింహారెడ్డి, సలహదారులు జి.బలవంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి పెద్ది మల్లేశం, కోశాధికారి ఆర్.మురళీగౌడ్, ఉపాధ్యక్షులు లింగంగౌడ్, నరహరిగౌడ్, నాగేశ్కుర్మ, సత్యనారాయణ, లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు.