Harish Rao | కుత్బుల్లాపూర్లో 22ఏ బాధితుల సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే వివేకానంద, మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఇన్ని వందల మంది ఇన్ని కాలనీల ప్రెసిడెంట్లు మా భూములు 22ఏలో పెట్టారని ఇక్కడికి ఎందుకు వచ్చారని అడుగుతున్నా..? అంటే పెట్టుడు నీ వంతు.. దరఖాస్తులు పెట్టి ఆఫీసుల చుట్టూ తిరుగుడు ప్రజల వంతా.. తప్పు చేసింది నువ్వు.. చేసిన తప్పును నువ్వే సవరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని డిమాండ్ చేశారు.
ప్రజలెందుకు ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టాలి. ప్రజలకెందుకు శిక్ష.. ప్రజలెందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఇవాళ ఒక భూమి, రెండు భూములను కాదు.. లక్షలాది మంది ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి కంటినిండా నిద్రలేకుండా చేశారన్నారు. తప్పు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిదని.. నువ్వు తప్పు చేస్తే ప్రజలకు శిక్ష ఎందుకు అని హరీశ్ రావు ప్రశ్నించారు. తప్పు ప్రభుత్వానిది.. శిక్ష ప్రజలదా.. నువ్వు రాత్రికి రాత్రి అత్యాశకు పోయి.. డబ్బులు సంపాదించాలనే దురాశలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ భూములన్నీ 22ఏలో పెట్టిండు. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలియనిది ఒకటుంటది.
నీ డబ్బు దురాశనే నీ దు:ఖానికి ఏదో ఒక రోజు కారణమవుతదని మిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ అని వారించారు. దురాశ ఎన్నటికైనా చేటే.. నువ్వు ఈ భూములన్నీ 22Aలో పెట్టాలే.. కమీషన్లు కొ్ట్టాలే. 30 శాతం వసూలు చేయాలని చేసిన ఒక కుట్రతో ఇవాళ లక్షలాది మంది ప్రజల జీవితాలు ఆగమైనయన్నారు. పెండ్లిండ్లు ఆగమైతున్నయ్.. దవాఖానాకు పోయేటోళ్లకు పైసలు లేక బ్యాంకుల కుదువ పెడతామంటే బ్యాంకులు తీసుకోవడం లేదు.. అప్పులిచ్చేవాడు అప్పులిస్తలేడు. అమ్ముకుందామంటే కొనేవాడు లేడు. ప్రాపర్టీల విలువ తగ్గిపోయిందన్నారు.
డబ్బులు సంపాదించాలనే దురాశతో రాత్రికి రాత్రి ఈ భూములన్నీ పొంగులేటి 22Aలో పెట్టాడు
నీ డబ్బు దురాశనే నీ దుఃఖానికి ఏదో ఒకరోజు కారణం అవుతుంది
నువ్వు 30 శాతం కమీషన్ వసూలు చేయడానికి చేసిన కుట్ర వల్ల లక్షలాది ప్రజల జీవితాలు ఆగం అయ్యాయి
– హరీష్ రావు https://t.co/WNL9eqMxpq pic.twitter.com/DOpOGBhwOF
— Telugu Scribe (@TeluguScribe) August 25, 2026
LIVE: కుత్బుల్లాపూర్ లో 22ఏ బాధితుల సమావేశం@BRSHarish https://t.co/YHqhwDaWoC
— BRS Party (@BRSparty) August 25, 2026
East Coast | పదో తరగతి అర్హత.. పదిహేను వందలకుపైగా పోస్టులు
Konda Surekha | కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసు.. జూబ్లీహిల్స్ సీఐ సస్పెన్షన్..!