Pocso Case | దుండిగల్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. దుండిగల్ డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లలో నివసిస్తున్న బాలికపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్‌లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివాసముంటున్న మైనర్ బాలికపై గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో దుండిగల్‌కు చెందిన దార శివకుమార్ బలవంతంగా అత్యాచారయత్నం చేశాడు.
ఎవరికైనా చెపితే ప్రాణం తీస్తానంటూ సదరు బాలికను బెదిరించాడు. దార శివకుమార్ అంతటితో ఆగకుండారెండు నెలల అనంతరం అతని స్నేహితుడు నిజాంపేట్‌కు చెందిన రాముతో కలిసి మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దార శివకుమార్ నుంచి వేధింపులు అధికమవడంతో బాధిత బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 17న ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
Chattogram | బంగ్లాదేశ్‌లో భారతీయ దౌత్యవేత్త అనుమానాస్పద మృతి.. గుండె పోటే కారణమా..?
US Tragedy | అమెరికాలో బాపట్ల టెక్కీ మృతి.. తల్లిదండ్రులు, తమ్ముడికి తీవ్ర గాయాలు