Cyber Crime | కుత్బుల్లాపూర్, మార్చి20 : సైబర్ నేరాల నియంత్రణపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కోరుతూ ఆదర్శ కో – అపరేటివ్ అర్బన్ బ్యాంకు ఆధ్వర్యంలో 20 రకాల సైబర్ ఆర్థిక నేరాల నియంత్రణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన అంశాల బుక్లెట్ను గురువారం పేట్ బషీరాబాద్ సిఐ విజయ్ వర్ధన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాల నియంత్రణపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పొరపాటున తమ విలువైన వ్యక్తిగత సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తులతో పంచుకోరాదని, అలాంటి వాటి నుంచి బయటపడేందుకు అవగాహన కలిగి ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ప్రతినిధులు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.