గౌతంనగర్, అక్టోబర్ 4 : టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం గౌతంనగర్ డివిజన్ యాదవనగర్‌లో రూ.30 లక్షల నిధులతో కార్పొరేటర్ మేకల సునీతారాముయాదవ్తో ఎమ్మెల్యే సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి జరిగిందంటే కేవలం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యపడిందని తెలిపారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో నెలకొన్న డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలను దశలవారీగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఈఈ లక్ష్మణ్, ఏఈ దీపక్, కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు రాముయాదవ్, పిట్ల శ్రీనివాస్, సతీశ్‌కుమార్ పాల్గొన్నారు.
గౌతంనగర్, అక్టోబర్ 4 : మౌలాలి గాంధీనగర్‌లో సమస్యలు లేకుండా చేస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గాంధీనగర్‌లో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు ఉండే విధంగా చూసుకోవాలని కాలనీ అసోసియేషన్ ప్రతినిధులను కోరారు. ప్రతి సమస్యను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులందరికి అందేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు అమీనొద్దీన్, భాగ్యనందరావు, సత్తయ్య, ఎండీ.సాధిక్, పూలపల్లి జగదీశ్‌యాదవ్, కాశప్ప, సంతోష్నాయుడు, గాంధీనగర్ అసోసియేషన్ అధ్యక్షులు బుడంపల్లి శ్రీనివాస్‌గౌడ్, మహంకాళీ ఆలయ చైర్మన్ ప్రవీణ్‌గౌడ్ పాల్గొన్నారు.
వినాయక్‌నగర్, అక్టోబర్ 4: కాలనీల సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం అల్వాల్ డివిజన్ ఎంఈఎస్ కాలనీలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ నగరం వేగవంతంగా విస్తరిస్తుందని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి జరుగుతుండటంతో ఇక్కడ కొత్తగా కాలనీలు ఏర్పాటు చేసుకుంటున్నారని అన్నారు. కొత్తగా ఏర్పడిన కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ, మంచి నీటి సదుపాయం, విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. సమావేశంలో వాటర్ వర్క్స్ డీజీఎం సాంబయ్య, ఎలక్ట్రికల్ ఏఈ స్వాతి, కాలనీ నాయకులు బాలకృష్ణ, శివయ్య, వెంకటేశ్వర్లు, నవీన్‌కుమార్, రాజేశ్, జాజల, శ్రీనివాస్, గంగాధర్, రాజు, సరళ, కవిత, నాయకులు కొండల్‌రెడ్డి, ఆనంద్, ఉదయ్‌కుమార్, సూర్యకిరణ్, దేవేందర్, బబిత, గాయత్రి, మాధవి పాల్గొన్నారు.