పోచారం,సెప్టెంబర్30 : కార్మికులు క్షేమంగా ఉంటేనే మున్సిపాలిటీ పరిశుభ్రంగా ఉంటుందని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం పోచారంలో ఎస్‌వైఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకుడు సామల సందీప్‌రెడ్డి పోచారం మున్సిపాలిటీ కార్మికులకు దసరా కానుకగా అందజేసిన నూతన వస్ర్తాలు, రూ.500 నగదును ఎమ్మేల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ.. కార్మికులను క్షేమంగా చూసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ కార్మికులతోనే మున్సిపాలిటీలో పరిశుభ్రత కనిపిస్తుందని పేర్కొన్నారు.
తన విద్యా సంస్థలు, దవాఖానలలో దాదాపు రెండు వేల మంది కార్మికులు పనిచేస్తారని, వారిని క్షేమంగా చూసుకుంటానని మల్లారెడ్డి వివరించారు. కార్మికులు క్షేమంగా ఉంటేనే సంస్థలు పరిశుభ్రతకు నోచుకుంటాయని తెలిపారు. కార్మికులకు అనుకూలంగా మల్లారెడ్డి సమావేశంలో నినాదాలు చేశారు. అనంతరం సందీప్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కార్మికులకు నూతన వస్ర్తాలు,రూ.500 లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌వైఆర్ ట్రస్టు చైర్మన్ సామాల యాదగి రిరెడ్డి, మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి,మాజీ చైర్మన్ కొండల్‌రెడ్డి, బోడుప్పల్,ఘట్కేసర్ బీఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవ రెడ్డి,బండారి శ్రీనివాస్ గౌడ్,మాజీ కౌన్సిలర్ మెట్టు బాల్‌రెడ్డి,బీఆర్ఎస్ నాయకులు బి.రాజేశ్వర్‌రెడ్డి,కె.ఎం.రెడ్డి,జితేందర్ నాయక్,ఎస్.బుచ్చిరెడ్డి,కార్మికులు పాల్గొన్నారు.