గాజులరామారం, ఆగస్టు 31 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి కాలనీ, బస్తీల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మంగళవారం గాజులరామారం డివిజన్ పరిధిలోని పలు బస్తీలు, కాలనీల్లో రూ.4.47 కోట్లతో భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరిరావుతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీరామ్‌నగర్‌లో రూ.29.80 లక్షలు, సుభాష్ చంద్రబోస్‌నగర్‌లో రూ.27.40 లక్షలు, శ్రీరామ్‌నగర్ (సాయిబాబా ఆలయం ) వద్ద రూ.23.10 లక్షలు, ఉమాదేవినగర్‌లో రూ.30.40 లక్షలు, హెచ్ఏఎల్కాలనీలో రూ.48.70 లక్షలు, ఎండమూరి లే అవుట్లో రూ.26.80 లక్షలు, కైలాష్ హిల్స్‌లో రూ.23.80 లక్షలు, బాలయ్యనగర్‌లో రూ.38.50 లక్షలు, రావినారాయణరెడ్డినగర్‌లో రూ.36.90 లక్షలు, నర్సింహాబస్తీలో రూ.19.30 లక్షలు, శివసాయిహిల్స్లో రూ.34.30 లక్షలు, కట్టమైసమ్మ బస్తీలో రూ.26.20లక్షలు, బతుకమ్మబండలో రూ.48.50 లక్షలు, ఆర్కే లే అవుట్లో రూ.49.80 లక్షలతో డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్నీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా మన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు విజయ్రామిరెడ్డి, నాయకులు రషీద్ బేగ్, కమలాకర్, సుంకరి సాయి ప్రతాప్, పరుష శ్రీనివాస్‌యాదవ్, నవాబ్, అబిద్, ఇబ్రహీం, చందు, సింగారం మల్లేశ్, అజయ్ ప్రసాద్‌గుప్తా, సురేశ్, ఖుర్షీద్‌బేగం, చెట్ల వెంకటేశ్, సాయిబాబా, మహేశ్, హమీద్, కాలనీల అధ్యక్షులు లక్ష్మణ్‌గౌడ్, శ్రీనివాస్, రఘు, మధు, సమ్మయ్యయాదవ్, కరుణాకర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.