కుత్బుల్లాపూర్, ఆగస్టు 29 : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తన పరిపాలనను కొనసాగిస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ఒక్కటే అని అన్నారు. ఆదివారం చింతల్ క్యాంపు కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన 43 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.20 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే వారికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో పేదలకు అనారోగ్య సమస్య వస్తే వారికి భారంగా మారేదని, అందుకు అస్పత్రుల ఖర్చుల కోసం పడరాని పాట్లు పడి.. అప్పులు చేసి జీవితాలను కష్టాలమయంగా మార్చుకున్నారన్నారు. ఇక అలాంటి కష్టాలకు చెరమగీతం పాడి, పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా లక్షల రూపాయలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని సంతోషకరమైన జీవితాలను గడపాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ఎంఎన్‌రెడ్డి నగర్ వెస్ట్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం చింతల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే.. నూతన కమిటీ సభ్యులను సన్మానించి, కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని, కాలనీలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ నూతన సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
గాజులరామారం డివిజన్, ఆదర్శనగర్‌లో నివాసం ఉండే సూర్యనారాయణ(43) కూలీ.. బిల్డింగ్ వద్ద ప్రమాదవశాత్తు కరెంటు షాక్‌కు గురై మృతి చెందాడు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రత్యేక చొరవతో రూ.5 లక్షల నష్టపరిహారం రాగా.. దానికి సంబంధించిన చెక్కును ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.
జీడిమెట్ల, ఆగస్టు 29 : కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాశ్‌నగర్ చివరి బస్‌స్టాప్ వద్ద దాత రాంబాటి ఇచ్చిన అంతిమయాత్ర వాహనాన్ని ఆదివారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుభాశ్ నగర్ ప్రాంతంలో చనిపోయిన వారి భౌతికగాయాలను స్మశాన వాటికకు తరలించేందుకు దాత రాంబాటి అంతిమయాత్ర వాహనాన్ని సమకూర్చడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు శ్రీకాంత్, అడపా శేషు, ఇస్మాయిల్, పద్మజారెడ్డి, శ్రీనివాస్, సురేశ్, క్రాంతి, శేఖర్, నర్పత్బాటి, అశోక్బాటి, ప్రేమ్‌కుమార్, పన్నాలాల్, తీర్పారం, సాజన్లాల్, లాల్‌చంద్, ప్రకాశ్ సోలంకి తదితరులు పాల్గొన్నారు.