కుత్బుల్లాపూర్,అక్టోబర్ 2 : రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్‌రాజు, మేడ్చల్-మల్కాజిగిరి డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి అన్నారు. శనివారం దూలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) ఆధ్వర్యంలో నిర్మించిన నూతన గోదాంతో పాటు కార్యాలయ ఆవరణలో సమావేశం మందిరం, మహాత్మాగాంధీ విగ్రహాలను చైర్మన్ గరిశె నరేందర్‌రాజు సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. సహకార సంఘాలు, బ్యాంకులను ఏర్పాటు చేసి రైతులకు తక్కువ వడ్డీతో రుణాలను అందిస్తున్నారని వివరించారు. రైతు సహకార సంఘాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్‌చైర్మన్ రత్లావత్ గంగయ్యనాయక్, పీఎసీఎస్ వైస్ చైర్మన్ ఎ.రవీందర్‌రెడ్డి, డైరెక్టర్లు సీహెచ్.మధుసూదన్, బి.సత్యనారాయణ, పి.మల్లేశ్, జి.క్రిష్ణయాదవ్, డి.నరేందర్, సీహెచ్.శ్రీనివాస్, బి.మధుసూదన్, నాగమణి, సి. సావిత్రి, ఎం.మదన్‌రావు, ఎ.సత్యనారాయణ, బ్యాంకు సీఈఓ తీగల కృష్ణ పాల్గొన్నారు.