దుండిగల్/జగద్గిరిగుట్ట, అక్టోబరు 6 : చదివుకునే చిన్నారుల చేయూతకు సరిహద్దులుండవని, కార్నివాల్ ఫౌండేషన్ నిరూపిస్తోందని విద్యావేత్తలు కొనియాడారు. ఇటలీకి చెందిన సంస్థ సహకారంతో రూ.70లక్షలతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజురామారంలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని నిర్మించారు. కార్మివాల్ ఫౌండేషన్ చైర్మన్ జాక్వెలిన్(జాకీ) సోమవారం ఇటలీ నుంచి వచ్చి ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఆమె మాట్లాడి తమసహకారం కొనసాగుతుందన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇప్పటివరకు 8 పాఠశాలలు నిర్మించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆయా పాఠశాలలను దత్తత తీసుకుని లైబ్రరీ, అదనపు సిబ్బందిని నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈవో జెమినికుమారి, ఉపాద్యాయులు సురేష్, మల్లేష్, శ్రవంతి, ఫౌండేషన్ ప్రతినిధులు చంద్రశేఖర్, శివారెడ్డి, బిందు, రత్నేశ్వరరావు పాల్గొన్నారు.