శామీర్పేట, ఆగస్టు : జీవీకే ఈఎంఆర్ఐ సంస్థలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11, 12వ తేదీల్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(ఈఎంటీ) ఉదోగ్యాలకు అర్హత బీఎస్సీ(నర్సింగ్), జీఎన్ఎం, బీఎస్సీ(బీజెడ్సీ), డీఎంఎల్టి, కార్డిక్ టెక్నాలజీ, నర్సింగ్ కేర్ కోర్స్(10+2), బీఎస్సీ(లైఫ్ సైన్స్), అనుభవం 1 సంవత్సరంలోపు, వయస్సు 23 నుంచి 30 సంవత్సరాలు, తెలుగు, ఇంగ్లీష్, చదవటం, రాయడం కలిగి ఉండాలన్నారు.
జీవీకే ఈఎంఆర్ఐ దేవరయాంజాల్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి 3 గంటల వరకు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9133771133 నెంబర్ను సంప్రదించాలని కోరారు.