Jagadgirigutta | పనుల్లో నిమ్మళం.. ప్రత్యామ్నాయంలో నిర్లక్ష్యం..
Jagadgirigutta | నిర్మాణం చూసి అనందపడాలో.. అడ్డంకులతో పనులు నింపాదిగా చేస్తున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి జగద్గిరిగుట్ట ప్రాంత వాహనదారులకు ఎదురవుతోంది.
Jagadgirigutta | జగద్గిరిగుట్ట : నిర్మాణం చూసి అనందపడాలో.. అడ్డంకులతో పనులు నింపాదిగా చేస్తున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి జగద్గిరిగుట్ట ప్రాంత వాహనదారులకు ఎదురవుతోంది. షాపూర్ నగర్ నుంచి జగద్గిరిగుట్ట వెళ్లే మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. లోతట్టుగా ఉన్న హెచ్ఎంటి ఖాళీ స్థలంలో రూ. కోటి నిధులతో ఆరు నెలల క్రితం బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి. మరో రెండు చోట్ల ఉన్న కల్వర్టుల విస్తరణకు నిధులు కేటాయించలేదు.
పనులు జరుగుచున్న చోట రోడ్డు డైవర్షన్ కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు సరిగా లేక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వేసవిలో దుమ్మురేగి వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షంతో ఆ మార్గంలో వెళ్లే వారి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. రోడ్డు మధ్యలో నీరు నిలిచి మరింత ఇబ్బందిగా తయారైంది. రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం వద్ద వాహనాలు ఢీకొట్టకుండా బారికేడ్లు, సూచికలు ఏర్పాటు చేయలేదు. ప్రధాన బ్రిడ్జి పూర్తయినా ఇరువైపులా అప్రోచ్ రోడ్డు నిర్మించాల్సి ఉంది. సిమెంటు రోడ్డు కావడంతో పూర్తిచేసి బ్రిడ్జి అందుబాటులోకి తీసుకురావడానికి మరో రెండు నెలలు పట్టేలా కనిపిస్తోంది. తాత్కాలిక రోడ్డును సరి చేయడంతో పాటు బ్రిడ్జి పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని వాహనదారులు కోరుతున్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

