construction wastage | ఇతరుల మాట వదిలేసి , ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లోని మట్టి, వ్యర్ధాలు ప్రధాన రహదారిపై పోస్తున్నా పట్టించుకునే దిక్కులేదు. ఈ పరిస్థితి జగద్గిరిగుట్ట పైప్ లైన్ రోడ్డు డంపు యార్డు పక్కన కనిపిస్తోంది. ఇక్కడి హెచ్ఎంటీ భూమిలో డంపుయార్డు సమీపంలో బ్లూ క్రాస్ సంస్థకు స్థలం కేటాయించారు. ఇటీవల ఈ ప్రాంతాన్ని చదును చేసి ప్రహరీ కోసం పనులు చేపట్టారు. ఎత్తుగా ఉన్న ప్రాంతాన్ని యంత్రాల సాయంతో తవ్వి సమీపంలో ఉన్న ప్రధాన రహదారిపై టిప్పర్లతో పారపోశారు. కేవలం మట్టి అయితే పర్వాలేదు భారీ బండరాల్లు ఉండడం ప్రమాదకరంగా పరిణమిస్తుంది.
మూడు రోజులుగా మట్టి డంప్..
సింగిల్ రోడ్డు కావడంతో వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు బండరాళ్లను ఢీకొంటున్నాయని వాహనదారులు వాపోతున్నారు. మట్టి పారబోస్తున్న ప్రాంతంలోనే సీసీ కెమెరాలు ఉన్నాయి. అయినా పట్టించుకోకుండా మూడు రోజులుగా మట్టిని డంప్ చేస్తున్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హెచ్ఎంటి కంపెనీలో సంయుక్త పర్యవేక్షణ ప్రాంతం.. పైగా అన్నింటికి హైడ్రా అంటున్న పరిస్థితుల్లో పారబోత స్థానికులను విస్తుపోయేలా చేస్తున్నది.
ఇక్కడికి సమీపంలోని డీసీపీ కార్యాలయం వద్ద భవన నిర్మాణాల వ్యర్థాల సేకరణ కోసం ప్రత్యేకంగా యార్డ్ ఏర్పాటు చేశారు. భారీగా ఉంటే గాజులరామారం సమీపంలోని రాంకీ కేంద్రానికి తరలించాల్సి ఉంది. గతంలోనూ ఇదే రోడ్డుకు ఇరువైపులా భారీగా వ్యర్థాలు పారబోయగా యంత్రాలతో చదును చేశారు. ఇకనైనా అధికారులు నియంత్రణ చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
KTR | మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ నివేదిక బూటకమని తేలిపోయింది : కేటీఆర్
Bad Breath | నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలను పాటించండి..!
Jio Electric Scooter | మార్కెట్లో జియో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇవీ ఆ స్కూటర్ ప్రత్యేకతలు