Car accicent | మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం.. కారు ఢీ కొని బాలుడు మృతి
Car accicent | ఓ వ్యక్తి అజాగ్రత్త డ్రైవింగ్‌తో బాలుడి మృతికి కారణమైంది. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పీర్జాదిగూడ మే 25: ఓ వ్యక్తి అజాగ్రత్త డ్రైవింగ్‌తో బాలుడి మృతికి కారణమైంది. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పర్వతాపూర్ భూలక్ష్మి నగర్ కాలనీకి చెందిన చౌహన్ రాజకుమార్ కుమారుడు విజయరాజ్ (18 నెలలు) శనివారం రాత్రి ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో పక్కనే నివాసం ఉంటున్న శ్రీనాథ్ అనే వ్యక్తి తన కారును నిర్లక్ష్యంగా నడుపుతూ విజయ్ రాజ్‌ను ఢీ కొట్టాడు.
ఈ ప్రమాదంలో బలుడి తలపై నుంచి కారు వెళ్లడం వల్ల తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు పరీక్షించి బాలుడు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. తన కుమారుని మృతికి కారణమైన వ్యక్తిపై కుటుంబ సభ్యులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

