మేడ్చల్, ఏప్రిల్ 6: మేడ్చల్ (Medchal) మున్సిపాలిటీ పరిధిలోని పూడూరులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. భారీగా మద్యం, నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు, 18 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. ఆదివారం తెల్లవారుజామున పూడూరులోని శ్రీనివాస్‌రావ్ ఫామ్ హౌస్‌పై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 16 సెల్ ఫోన్లు, రూ.4 లక్షల నగదుతోపాటు భారీ ఎత్తున మద్యం సీజ్ చేశారు. పట్టుబడిన వారిలో నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేఇస దర్యాప్తు చేస్తున్నారు.