షాద్నగర్రూరల్,జూన్06 : ట్రాలీ ఆటో బైకును ఢీకొట్టిన సంఘటనలో వ్యక్తికి గాయలైన సంఘటన శుక్రవారం రాత్రి షాద్నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. లింగారెడ్డిగూడ గ్రామనికి చెందిన గోద నర్సింలు టీవీఎస్ వాహనంపై వెళ్తుండగా పట్టణంలోని రైతు కాలనీవద్ద ట్రాలీ ఆటో వచ్చి ఢీకొట్టడంతో నర్సింలుకు తీవ్ర గాయాలయ్యాయి.
ఇదిలా ఉంటే ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. మద్యం మత్తులో బైకును ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రగాయలైన నర్సింలును చికిత్సనిమిత్తం దవాఖానకు తరలించారు. అదేవిధంగా ఆటో డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.