పహడిషరీఫ్, ఆగస్ట్ 31 : మాయామాటలతో మభ్యపెట్టి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితునికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిదని పహడిషరీఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు. 2023లో పోలీస్‌స్టేషన్ పరిధిలోని సోహెబ్ కాలనీ ఎర్రకుంట ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం తమ కూతురు(16) అమ్మాయి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతికతను వినియోగించి తప్పిపోయిన బాలిక కోసం గాలించారు. భాదితుల నివాసానికి సమీపంలో నివసించే ఆటో డ్రైవర్ సయ్యద్ ముఖరమ్(26) మైనర్ తో పరిచయం పెంచుకున్నాడు.
ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన నిందితుడు బాధితురాలిని తన ఇంటికి తీసుకెళ్లి పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు, కనిపించకుండా వెళ్లిపోయినట్లు ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తుచేసిన పోలీసులు బాధితురాలు ముఖరమ్ వద్ద ఉన్నట్లు సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. నిందితుని వద్ద నుండి బాధితురాలిని రక్షించిన పోలీసులు బాధితురాలికి వైద్య సహాయం అందించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితునిపై ఫోక్సో కేసు నమోదు చేసి కోర్టులో బలమైన సాక్ష్యాలతో చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు తెలిపారు.
ఎల్బీ నగర్ కోర్టు పోలీసులు అందించిన సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం ముఖరమ్ను దోషిగా తేల్చిందన్నారు. నిందితునికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు లక్ష రూపాలయ జరిమాన విధించినట్లు ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయరణ రెడ్డి తెలిపారు. కోర్టులో సాక్ష్యాలను అందించడంతోపాటు నిందితునికి శిక్ష పడే విధంగా ప్రయత్నించిన కోర్టు సిబ్బందిని ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి అభినందించారు.