మాడ్గుల, జూన్ 9: మాడ్గుల (Madgula) ప్రభుత్వ కళాశాల ముందు వ్యర్థపదాలకు నిలయంగా మారింది. సాధారణ ప్రజలతోపాటు పలువురు చికెన్ వ్యాపారులు కోళ్ల వ్యర్థాలను రాత్రి పూట తెచ్చి కాలేజీ వద్ద పడేసి పోతున్నారు. దీనికితోడు దావతులు చేసిన వారు కూడా ఇక్కడే వ్యర్థాలు పడేసిపోతున్నారు. గ్రామపంచాయతీ చెత్త కూడా కాలేజీ వద్దే వేస్తున్నారు. దీంతో వ్యర్థాలు దుర్వాసన వెదజల్లుతుండటంతో కళాశాల బయటికి వస్తే వాసన భరించలేని విధంగా ఉంటుందని విద్యార్థులు వాపోతున్నారు. అధికారులకు, నాయకులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం జరగలేదని తెలిపారు. వ్యర్థ పదాలను ఇక్కడ వేయకుండా నివారణ చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.