మృగశిరకార్తె రోజున చేపలు తినడం ఆనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఈ రోజున చేపలు తినటం వలన అనేక రోగాలు దూరమవుతాయనే నమ్మకం ప్రజల్లో ఉన్నది. కాగా, శనివారం మృగశిరకార్తెను పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపల అమ్మకాలు జరిగాయి.
పల్లెలు, పట్టణాల్లో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి విక్రయించారు. కొనుగోలుదారులతో చేపల దుకాణాలు కిక్కిరిశాయి. ఇబ్రహీంపట్నంతో పాటు పలు చెరువుల వద్ద జాతర వాతావరణం కనిపించింది. చేపలకు డిమాండ్ పెరగడంతో ధరలు చుక్కలనంటాయి. కొర్రమీను రూ.400నుంచి రూ.500వరకు విక్రయించగా, బొచ్చ, రవ్వలాంటి చేపలు రూ.200 నుంచి రూ.300 వరకు అమ్మారు.
-ఇబ్రహీంపట్నం, జూన్ 8