బండ్లగూడ,నవంబర్ 16 : మూసీ నదిలో మట్టి దిబ్బలు పోసి చదును చేస్తున్నారు. దీంతో మూసీ నది కుచించుకుపోవడంతో పాటు మూసీ నది ప్రవావహం ఆగిపోయి నీరు నిల్వ ఉండే ప్రమాదం ఉంది. తద్వారా అనేక అనార్థలకు దారి తీస్తుందని స్థానిక ప్రజలు అవేదన వ్యక్త చేస్తున్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయిరాంనగర్ కాలనీ సమీపం నుంచి మూసీ నదీ ప్రవహిస్తుంది. కాగా, మూసీకి అటు వైపు ఆర్మీ స్థలం ఉంటుంది.
ఇటీవల ఆర్మీ ప్రాంతంలో ఉన్న మూసీలో మట్టి దిబ్బలు పోసి చదును చేస్తున్నారు. దీంతో మూసీ నది ప్రవాహం ఆగిపోవడంతో పాటు అక్కడ నీరు నిల్వ ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. మూసీలో నీరు నిల్వ ఉండటం ద్వారా దోమలు విజృంభిస్తాయని అందులోంచి వచ్చే దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులకు గురవుతామంటున్నారు. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని మూసీ నదిలోంచి మట్టి దిబ్బలను తోలగించి మూసీ ప్రవాహానికి ఉన్న ఆడ్డంకిని తప్పించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.