Mehfil | ఇబ్రహీంపట్నం, మే 15 : ఇబ్రహీంపట్నంలోని ఓ రెస్టారెంట్లో కస్టమర్ తింటున్న బిర్యానీలో బల్లి దర్శనమిచ్చింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ గ్రామానికి చెందిన గుజ్జా కృష్ణారెడ్డి అనే వ్యక్తి గురువారం మధ్యాహ్నం బిర్యానీ తినేందుకు సాగర్ రహదారిలోని మెహఫిల్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. కాగా, ఆయన తింటున్న చికెన్ బిర్యానీలో బల్లి కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీంతో అతడు రెస్టారెంట్ యజమానిని ప్రశ్నించాడు. ఏమైతుంది.
బల్లి మంచిగా ఫ్రై అయ్యిందిగా తిను అంటూ నిర్లక్ష్యంగా సమాధాన మిచ్చాడు. రెస్టారెంట్ యజమాని కృష్ణారెడ్డితో ఏమి చేసుకుంటావో చేసుకో అనే విధంగా మాట్లాడడంతో వెంటనే అతడు డయల్ 100కు ఫోన్ చేశాడు. రెస్టారెంట్ వద్దకు చేరుకున్న పోలీసులు వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు. దీంతో అప్రమత్తమైన రెస్టారెంట్ యజమాని దానికి తాళం వేసి పరారైనట్లు సమాచారం.