చేవెళ్ల రూరల్, డిసెంబర్ 8 : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని శంకర్పల్లి మండలం కేంద్రం శ్రీరాంనగర్ కాలనీకి చెందిన మేదరి అంజయ్య (65), మేదరి యాదగిరి (42) తండ్రీకొడుకులు. 2020 ఆగస్టు నెలలో తండ్రి అంజయ్యను కుమారుడు యాదగిరి సొంత ఇంటిలోనే కత్తితో నరికి హత్య చేశాడు. దీంతో శంకర్పల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
ఈ సందర్భంగా గురువారం ఎల్బీనగర్ (రంగారెడ్డి) 9వ అడిషనల్ కోర్టు నేరస్తుడికి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధించారు.