Lawyers Boycott | నాంపల్లి కోర్టులు: రంగారెడ్డి జిల్లా కోర్టు మహిళా జడ్జిపై గురువారం జరిగిన దాడికి నిరసనగా శుక్రవారం నాంపల్లి కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. మహిళా జడ్జి పై జరిగిన దాడి న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా పరిగణించి న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్యవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బార్‌కు బెంచ్‌కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, దాడికి పాల్పడిన నిందితుడ్ని కఠినంగా శిక్షించే విధంగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కోశాధికారి లడ్డ, ఉపాధ్యక్షులు గోకుల్, సభ్యులు, న్యాయ వాదులు రామనగౌడ్, డీ అనంత రఘు, తదితరులు పాల్గొన్నారు.