Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Govt Land | అధికారులు దసరా పండుగ సమయంలో బిజీగా ఉంటారని గ్రహించిన కబ్జారాయులు.. వారి కండ్లుగప్పి రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట పరిధిలోని కుర్మల్‌గూడలో ఐదెకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేదామని పెద్ద స్కెచ్ వేశారు. ఇంకేముంది 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి సరిహద్దులు ఫిక్స్ చేసుకున్నారు.
- ఎలాంటి పత్రాలు లేకున్నా మీటర్లు, కరెంట్ కనెక్షన్
- కుర్మల్‌గూడ సర్వే నంబర్ 80/3లో ఐదెకరాలకు ఎసరు
- మల్లాపూర్ సర్వే నంబర్ 73లో ప్రభుత్వ భూమి కబ్జా
- స్థానికుల జోక్యంతో బోరు తొలగించిన అధికారులు
- జీవో 59 కింద రూ.90 కోట్ల విలువైన స్థలం కాజేసే యత్నం
Govt Land | బడంగ్పేట్, అక్టోబర్ 19 : సర్కార్ భూమిని కాజేసేందుకు కబ్జాదారులు పెద్ద స్కెచ్చే వేశారు. రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట పరిధిలోని కుర్మల్‌గూడలో రూ.90 కోట్ల విలువ చేసే ఐదెకరాల ప్రభుత్వ భూమిని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్నారు. కరెంటు మీటర్ తీసుకుంటే జీవో 59 కింద దరఖాస్తు చేసుకోవచ్చని ప్లాన్ చేశారు. ఇంకేముంది రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు వేశారు. ఏకంగా పైపులైన్లు తీశారు. ఎలాంటి పత్రాలు లేకుండానే విద్యుత్ అధికారులు కరెంట్ మీటర్లు, కనెక్షన్ వచ్చేశాయి. ఇంకేముంది ఆ వ్యవసాయం చేస్తున్నట్టు నమ్మించి ఆ ఐదెకరాల పొలం తనదేనంటూ అక్రమదారుడు బుకాయించాడు. ఈ విషయమై అనేకమార్లు రెవెన్యూ అధికారులు అతడిని హెచ్చరించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో వారు ప్రభుత్వ భూమిని నిషేధిత జాబితా 22ఏలో చేర్చారు. అయినప్పటికీ ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా ఆక్రమించుకోవడానికి వెనుకాడలేదు.
దసరా పండుగకు ప్లాన్..!
అధికారులు దసరా పండుగ సమయంలో బిజీగా ఉంటారని గ్రహించిన కబ్జారాయులు.. వారి కండ్లుగప్పి కబ్జా చేదామని పెద్ద స్కెచ్ వేశారు. ఇంకేముంది 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి సరిహద్దులు ఫిక్స్ చేసుకున్నారు. వ్యవసాయం చేస్తున్నట్టు నమ్మించి రికార్డుల్లో నమోదు చేయించుకోవాలని ఎత్తుగడ వేసుకున్నారు. కరెంటు మీటర్ తీసుకుంటే జీవో 59 కింద దరఖాస్తు చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇంకేముంది కథ మొదలుపెట్టారు. ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కంకణం కట్టుకున్నారు. 59 జీవో ద్వారా ధరఖాస్తులు చేసుకోవాలంటే ఏదో ఒక అధారం ఉండాలనే ఉద్దేశంతో కరెంటు మీటర్ తీసుకున్నారు.
వ్యవసాయం చేస్తున్నట్టు నమ్మించడానికి ఎత్తులు..
వ్యవసాయం చేస్తున్నట్లు చూపించాలని బోరు వేశారు. ఎప్పటి నుంచో వ్యవసాయం చేస్తున్నామని చెప్పడానికి కరెంటు మీటర్‌ను ఆధారం చూపించాలనుకున్నారు. అయితే స్థానికుల సమాచారంతో కబ్జారాయుల కథ అడ్డం తిరిగింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి బోరు వేశారన్న విషయం రెవెన్యూ అధికారులకు తెలిసింది. దీంతో బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి, ఆర్ఐ మచ్చేందర్ సర్వే నంబర్ 80/3లోఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ప్రభుత్వ భూమిలో బోరు వేశారనే నిర్ధారణకు రావడంతో.. తహసీల్దార్ ఇందిరాదేవి ఆదేశాల మేరకు సోమవారం ఆర్ఐ మచ్చేందర్ బోరును తొలగించారు. మరోసారి ఇలా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వ భూమిలో కరెంట్ కనెక్షనా?
నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమికి విద్యుత్ అధికారులు కరెంట్ మీటర్లు ఇవ్వడంపై రెవెన్యూ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా మీటర్లు, కనెక్షన్ ఎలా ఇస్తారని తహసీల్దార్ ఇందిరాదేవి మండిపడ్డారు. మల్లాపూర్‌లోని ప్రభుత్వ భూమిలో నిర్మాణాల విషయమై ఆగ్రహించిన ఆమె.. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశామని, ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Read Also :
గుజరాత్లో విద్యుత్తు సంక్షోభం.. మోదీ స్వరాష్ట్రంలో చీకట్లు.. కోతలతో జనం అవస్థలు
పాలమూరు- రంగారెడ్డి మోటర్లు బంద్.. పంపులు నడిపే చేతగాక హ్యాండ్సప్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

