యాచారం, మే 20 : కూలీల సమస్య లు పరిష్కరించడంతోపాటు పెండింగ్‌లో ఉన్న బిల్లులను త్వరగా చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య డిమాండ్ చేశారు. జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం 16వ సామాజిక తనిఖీల్లో భాగంగా మంగళవారం మండల ప్రజా వేదిక కార్యక్రమం ఎంపీడీవో శైలజ ఆధ్వర్యంలో జరుగగా.. దీనికి డీఆర్డీవో శ్రీలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలోనే ఉపాధి కూలీలు ఆందోళనకు దిగారు. నేలపై బైఠాయించి.. గంటపాటు నిరసన తెలిపి.. అధికారులకు వ్యతిరేకం గా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ప్రజావేదికను ఓపెన్‌గా ప్రజల సమక్షంలో నిర్వహించాలని, రహస్యంగా కార్యాలయంలో నిర్వహించడం ఎంతవరకు సమంజసమని అంజయ్య మండిపడ్డారు. కూలీల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఎండాకాలంలోనూ కూలీలకు కనీస వసతులు కల్పించలేదని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జాబ్‌కార్డు ఉన్నా పని కల్పించలేదన్నారు. అనంతరం కూలీల సమస్యలను పరిష్కరించాలని డీఆర్డీవోకు వినతిపత్రాన్ని అందజేశారు. కాగా మండలంలోని ఐకేపీ కార్యాలయంలో జరిగిన మండల ప్రజావేదిక కార్యక్రమం తూతూ మంత్రంగా జరిగింది. కార్యక్రమంలో ప్రత్యేకాధికారిణి సునీత, ఏవీవో కొండయ్య, ఏపీడీ చర ణ్, ఎంపీడీవో శైలజ, ఎంపీవో శ్రీలత, ఏపీవో లింగయ్య, ఈసీ శివశంకర్‌రెడ్డి, ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు, సిబ్బంది, కూలీలు ఉన్నారు.