ఆదిబట్ల : ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం రానున్నారు. ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని బొంగుళూరులోని ప్రమిద గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని పార్టీ రాష్ట్ర యువనాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీతోపాటు.. సెగ్మెంట్లోని పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకోవడంతో.. పట్నం మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, సర్పంచ్‌లను కేటీఆర్ సన్మానించనున్నట్టు పేర్కొన్నారు. ప్రోగ్రాంకు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు అధికంగా హాజరై సక్సెస్ చేయాలన్నారు.