PhD Award | ఆదిబట్ల, జులై 17: కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విభాగంలో చేసిన పరిశోధనలకు గాను కొటారి నిర్మలకు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి నుండి డాక్టరేట్‌ను ప్రకటించింది. ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ ఉషారాణి పర్యవేక్షణలో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విభాగంలో నిర్మల చేసిన పరిశోధనలపై సంతృప్తి వ్యక్తం చేసిన యూనివర్సిటీ పట్టా అందజేసింది. ప్రస్తుతం కొటారి నిర్మల ఇబ్రహీంపట్నం గురునానక్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తను డాక్టరేట్ పొందడానికి సహకరించిన గురునానక్ యూనివర్సిటీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.