ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్
జిల్లా వ్యాప్తంగా కేసీఆర్ మహిళాబంధు వేడుకలు
ఇబ్రహీంపట్నం, మార్చి 6 : మహిళల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మహిళలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మహిళల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్టు, షీ టీమ్స్‌తో పాటు ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలుస్తున్నదన్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో మహిళల సంక్షేమాన్ని ఏ ఒక్కరూ పట్టించుకోలేదన్నారు. 3 రోజుల పాటు నిర్వహించే మహిళా దినోత్సవాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు శ్వేత, మమత, శ్రీలత, సుజాత, మంగ, జ్యోతి, పద్మ, జగ న్, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
కేశంపేట : మహిళల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని వేములనర్వలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐసీడీఎస్, హుమానా పీపుల్ టూ పీపుల్ ఇండియా సంస్థ ఆధ్వర్యం లో మహిళా దినోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సమాజంలో పురుషులతో సమానంగా మహిళలకు అన్నిరంగాల్లో ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. అనంతరం ఎమ్మెల్యేకు మహిళలు, చిన్నారులు రాఖీలను కట్టి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ పీ రవీందర్ , జడ్పీటీసీ తాండ్ర విశాల, వైస్ ఎంపీపీ అనురాధ, ఐసీడీఎస్ పీడీ నాగమణి, మహిళా సర్పంచ్, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
సంబురంగా కేసీఆర్ మహిళా బంధు ..
ఆమనగల్లు : ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో కేసీఆర్ మహిళా బంధు వేడుకలు సంబురంగా జరిగాయి. ఆమనగల్లు మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో విధు లు నిర్వహించే వైద్య సిబ్బందిని, పారిశుధ్య కార్మికులను సన్మానించారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు రాఖీలు కట్టి తమ అభిమానం చాటుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎల్లప్పడూ అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ తోటగిరియాదవ్,ఎంపీటీసీ సరిత, కౌన్సిలర్ రాధమ్మ, నాయకులు నిరంజన్, నర్సింహ్మ, శంకర్, రమేశ్, ప్రశాంత్, మల్లేశ్ పాల్గొన్నారు.
పారిశుధ్య మహిళా కార్మికులకు సన్మానం
నందిగామ : మండల కేంద్రంలో నందిగామ సర్పంచ్ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జడ్పీ వైస్‌చైర్మన్ ఈట గణేశ్ హాజరయ్యారు. మహిళలు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పారిశుధ్య మహిళా కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో చేగూరు పీఏసీఎస్ చైర్మన్ అశోక్, నర్సప్పగూడ అశోక్, ఉపసర్పంచ్ కుమార్ పాల్గొన్నారు.
పంచాయతీ కార్మికులు, ఉత్తమ మహిళలకు సన్మానం
ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాయపోల్, దండుమైలారం, పోచారం, ఉప్పరిగూడ, చర్లపటేల్‌గూడ, కప్పాడు, పోల్కంపల్లి, నాగన్‌పల్లి, ముకునూరు గ్రామాల్లో పారిశుధ్య కార్మికులు, ఉత్త మ మహిళలను సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సన్మానించారు. తులేకలాన్ గ్రామంలో మహిళా పారిశుధ్య సిబ్బందికి సర్పంచ్, ఎంపీటీసీల ఆధ్వర్యంలో బట్టలు పంపిణీ చేశా రు. పోచారం గ్రామంలో ఎంపీపీ కృపేశ్, టీఆర్ఎస్ మండ ల మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
మహిళల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి
కడ్తాల్ : మహిళల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు వాణీశ్రీ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టి, పారిశుధ్య కార్మికులలు, ఆశ వర్కర్లు, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందిని ప్రజాప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు జంగమ్మ, నరేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, గణేశ్‌గౌడ్, నర్సింహ, రాంచంద్రయ్య, వెంకటయ్య, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు సన్మానం
కొందుర్గు : సమాజంలో మహిళలకు తప్పని సరిగా ప్రాధాన్యతనివ్వాలని కొందుర్గు మండలంలోని విశ్వనాథ్‌పూర్ సర్పంచ్ శ్రీధర్‌రెడ్డి అన్నారు. మహిళా బంధు ఉత్సవాల్లో భాగంగా విశ్వనాథ్‌పూర్ గ్రామంలో సర్పంచ్ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ దేవమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హఫీజ్, బాబురావు, ఎస్ఎంసీ చైర్మన్ రమాదేవి, రేణుక, నర్సింహారెడ్డి, ఎదిర రామకృష్ణ పాల్గొన్నారు.
రాఖీలు కట్టి.. చీరలు పంచి
హయత్‌నగర్ రూరల్ : పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ 14వ వార్డులో ఆదివారం కేసీఆర్ మహిళాబంధు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ సతీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్ తొండా రోహిణి సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు. జీహెచ్ఎంసీ, పెద్ద అంబర్‌పేట మున్సిపల్ సిబ్బంది, ఇతర పారిశుధ్య కార్మికులు, ఆశలు తదితరులు దాదాపు 300 మందికి చీరలు పంపిణీ చేశారు. థాంక్యూ కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో రంగేశ్వరి, శిల్పారెడ్డి, సతీశ్‌యాదవ్, జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహిళలు స్వయం శక్తితో ఎదగాలి
కొత్తూరు రూరల్ : రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత అన్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామా ల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శేరిగూడబద్రాయపల్లి, మల్లాపూర్, తీగాపూర్, పెంజర్ల, సిద్ధాపూర్ గ్రామాల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మెండె కృష్ణయ్యయాదవ్, టీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు కడల శ్రీశైలం ఆధ్వర్యంలో ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేసి రాఖీలు కట్టారు. మల్లాపూర్‌లో ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
వివిధ గ్రామాల్లో ..
యాచారం : మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషిచేస్తున్నారని టీఆర్ఎస్ మండల మహిళా విభాగం అధ్యక్షురాలు మద్దెల శశికళ అన్నారు. మండలంలోని తాడిపర్తి, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు మద్దెల శశికళ, తక్కళ్లపల్లి సర్పంచ్ సంతోష తదితరులు పాల్గొన్నారు.
రిజర్వేషన్ పెంచిన ఘనత టీఆర్ఎస్దే..
మొయినాబాద్ : చిలుకూరు గ్రామంలో మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని సీఎం కేసీఆర్ చిత్ర పటాన్ని ఏర్పాటు చేసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఎంపీపీ నక్షత్రం మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 33 శాతం మాత్రమే మహిళలకు రిజర్వేషన్ ఉండేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించిందని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గునుగుర్తి స్వరూప, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయవంత్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : ఎంపీపీ విజయలక్ష్మి ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కట్ కమిటీ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి క్షీరాభి షేకం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివనీ, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, సర్పంచ్‌లు మాణిక్యరెడ్డి, నరహరి రెడ్డి, జిల్లా సివిల్ సైప్లె కమిటీ సభ్యుడు రవీందర్, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
మాడ్గుల : మండల వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు వివిధ రంగాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళలను సత్కరించారు. ఆయా గ్రామాలు, తండాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టారు. కార్యక్ర మంలో మాజీ ఎంపీపీ జైపాల్‌నాయక్, సర్పంచ్ హీరాదే వి, నాయకులు విజయ్, భాస్కర్, శంకర్ పాల్గొన్నారు.
శంకర్పల్లి : మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, 14వ వార్డు కౌన్సిలర్ శ్వేతతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి జడ్పీటీసీ గోవిందమ్మ రాఖీలు కట్టారు.