కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని అన్మాస్‌పల్లి గ్రామానికి చెందిన అనసూయకి రూ. 18వేలు, వెల్దండ మండలం ఏంజీ తండాకి చెందిన కౌసల్యకి రూ. 60 వేలు, బండోనిపల్లి గ్రామానికి చెందిన గీతకి రూ. 20వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సహకరంతో మంజూరయ్యాయి. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్తో నిరుపేదలకందరికి కార్పోరేట్ దవాఖానల్లో వైద్యం అందుతున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిదని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేందర్‌రెడ్డి, శేఖర్ పాల్గొన్నారు.