కడ్తాల్ : ఆపదలో ఉన్న క్లాస్‌మెట్స్ కుటుంబానికి అండగా నిలిచారు తోటి స్నేహితులు. పది రోజుల క్రితం మండల కేంద్రానికి చెందిన కంబాలపల్లి శ్రీశైలం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు కడ్తాల్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్నాడు. 2009-10 బ్యాచ్‌కి చెందిన పదో తరగతి విద్యార్థులు ఆదివారం శ్రీశైలం కుటుంబాన్ని పరామర్శించి రూ. 50వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో పదో తరగతి స్నేహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.