షాబాద్, మార్చి 8 : ఉమ్మడి జిల్లా ప్రజలు మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ‘కేసీఆర్ మహిళాబంధు’ సంబురాలు మూడో రోజూ అంబరాన్నంటాయి. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని మహిళా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వైద్యసిబ్బంది, పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. చేవెళ్ల నియోజకవర్గం షాబాద్‌లో జడ్పీటీసీ అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే కాలె యాదయ్య 500 మంది మహిళలకు చీరలు పంపిణీ చేసి సత్కరించారు. ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, షాద్‌నగర్, కొత్తూర్ మండలాల్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఆమనగల్లులో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పాల్గొని మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. వికారాబాద్ జడ్పీ కార్యాలయంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి పాల్గొన్నారు. అలాగే వికారాబాద్‌లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, తాండూరులో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, బొంరాస్‌పేట్‌లో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి వేడుకలకు హాజరయ్యారు. కలెక్టరేట్లో జరిగిన సంబురాల్లో కలెక్టర్ నిఖిల కేక్ కట్ చేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజులుగా నిర్వహించిన మహిళాబంధు సంబురాలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మంగళవారం పెద్ద ఎత్తున సంబురాలు జరిగాయి. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని మహిళా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వైద్యసిబ్బంది, పారిశుధ్య కార్మికులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై సమావేశాల్లో వివరించారు. చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండల కేంద్రం స్టార్ గార్డెన్లో జడ్పీటీసీ అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొని 500 మంది మహిళలకు చీరలు పంపిణీ చేసి, సన్మానించారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన వేడుకల్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాల్గొనగా, షాద్‌నగర్, కొత్తూర్ మండలాల్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఆమనగల్లులో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పాల్గొని మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో మహిళా బంధు వేడుకలు ముగిశాయి.
వికారాబాద్ జిల్లాలో..
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబురాలు మంగళవారం వికారాబాద్ జిల్లా పరిధిలో ఘనంగా జరిగాయి. వికారాబాద్‌లోని జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశం హాలులో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. వికారాబాద్‌లోని మున్సిపల్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగిలోని కేఎస్ఆర్ గార్డెన్లో జరిగిన సంబురాల్లో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, తాండూరులో జరిగిన వేడుకల్లో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, కొడంగల్ నియోజకవర్గం బొంరాస్‌పేట్ మండలంలో జరిగిన మహిళా దినోత్సవంలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిలు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో కలెక్టర్ నిఖిల పాల్గొని అధికారిణులతో కలిసి కేక్ కట్ చేశారు.