Kothuru | కొత్తూరు, ఏప్రిల్ 29: ఆర్అండ్బీ రోడ్డును ఆనుకొని అక్రమంగా నిర్మిస్తున్న ఓ వాణిజ్య సముదాయానికి అధికారులు నోటీసులు అందజేశారు. వివరాల్లోకి వెళితే కొత్తూరు మండలంలోని ఇన్ముల్నర్వ గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తూరు నుంచి జేపీ దర్గాకు వెళ్లే ఆర్ అండ్ బీ రహదారిపై జి గీత(భర్త పేరు రాజేందర్రెడ్డి) ఏ విధమైన అనుమతులు తీసుకోకుండా వాణిజ్య సముదాయం నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో ఇన్ముల్నర్వ సెక్రెటరీ నర్సింహా వాణిజ్య సముదాయం నిర్మిస్తున్న గీతకు నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్మి మాట్లాడుతూ ఏ విధమైన అనుమతులు లేకుండా భవనం నిర్మిస్తున్నాడని చెప్పారు. భవన నిర్మాణ పనులు ఆపాలని ఆదేశించామని చెప్పారు. అనుమతులు తీసుకుని నిర్మించాలని లేకపోతే నిర్మాణాన్ని కూల్చివేస్తామని హెచ్చరించారు.