ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 3 : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 16న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్‌పై బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన 16 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ.. గత నెల 8న కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ మేరకు నిర్వహించే సమావేశానికి కౌన్సిలర్లందరూ హాజరు కావాలని కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డిని ప్రత్యేకాధికారిగా నియమించారు. అవిశ్వాస తీర్మానంతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ రాజకీయం రసవత్తరంగా మారింది. మున్సిపల్ చైర్‌పర్సన్‌ను గద్దె దించేందుకు బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు అవిశ్వాసానికి తెరలేపగా.. మరోవైపు తన పదవిని కాపాడుకోవటం కోసం చైర్పర్సన్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.