తుర్కయంజాల్, ఏప్రిల్ 19: రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడ సర్వే నంబర్ 213, 214లో శనివారం హైడ్రా (HYDRA) అధికారులు కూల్చివేతలు చేపట్టారు. వివరాలలోకి వెళ్తే కమ్మగూడ సర్వే నంబర్ 213, 214లో కొన్ని సంవత్సరాల క్రితం రంగ ప్రసాద్ అనే వ్యక్తి లే అవుట్ చేసి ప్లాట్లను విక్రయించాడు. అయితే సదరు సర్వే నెంబర్ లోని స్థలం తనదంటూ ఓ వ్యక్తి కోర్టు ను ఆశ్రయించగా కోర్టులో అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది.
దీంతో గత రెండు సంవత్సరాల క్రితం ప్లాట్లను కబ్జాలోకి తీసుకొని ఫ్రీ కాస్ట్ గోడను నిర్మించాడు. దీంతో పలు కాలనీలకు వెళ్లే రోడ్డు సైతం ముసివేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది తలెత్తింది. ఇటీవల కాలనీ వాసులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన అధికారులు శనివారం రాకపోకలకు అడ్డుగా ఉన్న ఫ్రీ కాస్ట్ గోడలను కూల్చివేశారు. కూల్చివేతలలో హైడ్రా అధికారుల బృందం తదితరులు పాల్గొన్నారు.