వికారాబాద్, సెప్టెంబర్ 5 : మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులకు బోధించాలని శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 39 మంది టీచర్లను ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, పరిగి, తాండూ రు, చేవెళ్ల ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, కాలె యాదయ్య, కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, ట్రైనీ కలెక్టర్ ఉమాహారతి, డీఈ వో రేణుకాదేవిలతో కలిసి ఆయన శాలువాలు, ప్రశంసాపత్రాలతో సత్కరించారు.
అనంతరం స్పీకర్ మాట్లాడుతూ..మహాత్మా జ్యోతిరావు పూ లే, సావిత్రీబాయిపూలే, అంబేద్కర్ విద్య ప్రాధాన్యాన్ని గుర్తించారని.. ఆ మహనీయులను స్మరించుకుంటూ చిన్నారులకు బోధించాలన్నా రు. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని.. జీవితాలను మలుపుతిప్పే శక్తి కేవలం గురువులకు మాత్రమే ఉం టుందన్నారు. మన ఎదుగుదలకు కారకులైన గురువులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ తనకు చదువు చెప్పిన గురువులను గుర్తు చేసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ 20 ఎకరాల్లో సమీకృత పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. విద్యతోనే దేశ రూపురేఖలను మార్చొర్చని చెప్పిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తనకు మొట్టమొదటి గురువు తన తల్లియేనని చెప్పారు. జిల్లాలో 951 పాఠశాలలుండగా ఇప్పటికే 250 బడుల్లో మౌలిక వసతు లు కల్పించామని.. మిగతా పాఠశాలల్లోనూ ఆ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. మనం ఉన్నత స్థాయిలో ఉన్నామంటే అందుకు కారణం గురువులేనని స్పష్టంచేశారు. అనంతరం ఎమ్మెల్సీ మ హేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యాదయ్య, రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో వికారాబాద్ ఆర్డీవో వాసుచంద్ర, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రధానోపాధ్యాయులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.