రైల్వే కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. పోలీసులు కేవలం రోడ్డు మార్గంపైనే దృష్టి సారిస్తుండడంతో అక్రమార్కులు వా రి కండ్లు కప్పి రోడ్డు మార్గంతోపాటు రైళ్లలోనూ గంజాయిని తరలిస్తున్నా రు. ప్రధానంగా రైళ్లలో ఒడిశా నుం చి విశాఖ మీదుగా వికారాబాద్, వికారాబాద్ నుంచి ముంబై, పుణె, బెంగళూరుకు గుట్టుచప్పుడు కాకుం డా వందల కిలోలను తరలిస్తున్నా రు. రోడ్డు మార్గం కంటే రైళ్ల ద్వా రానే ఈ దందా అధికంగా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. తాజాగా లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో విశా ఖ నుంచి అక్రమంగా తరలిస్తున్న 28 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కర్ణాటక నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ మధ్య గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం. -వికారాబాద్,
డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ)
రైళ్లలో నిఘా కొరవడడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. వాటిలో గంజాయితోపా టు గుట్కాను అక్రమంగా తరలిస్తున్నారు. గత నాలుగేండ్లలో గంజాయిని తరలిస్తున్న సుమారు 100 మందికిపైగా కేసులు నమో దు చేయడంతోపాటు వందల కిలోలకుపైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ల లెక్కలు చెబుతున్నారు. డ్రగ్స్ ముఠాలు రైళ్లలో తీసుకొస్తున్న గంజాయిని జిల్లా కేం ద్రంతోపాటు తాండూరు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు తరలిస్తూ యువతను మత్తుకు బలి చేస్తున్నారు. ఒడిశా, కర్ణాటక నుం చి జిల్లాతోపాటు హైదాబాద్‌కు గంజాయి, గుట్కాల ను తరలిస్తున్నారు. పోలీసులు గంజాయిని తరలిస్తూ పట్టుబడిన వారి నుంచి గంజాయిని స్వా ధీనం చేసుకొని వారిపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారే తప్పా.. అసలు నిం దితులను పట్టుకునే దిశగా విచారణ చేపట్టడంలేదనే విమర్శలున్నాయి. మరోవైపు జిల్లాలోని మర్పల్లి మండలంలో ఓ పార్టీకి చెందిన నాయకుడు గుట్టుచప్పుడు కాకుండా తన పొలంలో గంజాయిని సాగు చేయడంతోపా టు స్థానిక పోలీసులను మేనేజ్ చేస్తూ దానిని పుణెకు తరలిస్తున్నట్లు జిల్లా అంతటా గతేడాదిగా ప్రచారం జరుగుతున్నది.
రిసార్ట్‌లపై నిఘా ఏది..
వికారాబాద్ జిల్లా కేంద్రం చుట్టూ పదుల సంఖ్యలో రిసార్ట్లు వెలిశా యి. పెరిగిన పోటీ నేపథ్యంలో యువతను ఆకర్షించేందుకు వాటి నిర్వాహకు లు గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి చుట్టూ పక్కల వెలసిన రిసార్ట్‌లకు వీకెండ్లో అధిక సంఖ్యలో విద్యార్థులు, యువత వస్తుంటా రు. ఇదే అదునుగా రిసార్ట్‌లలో గంజాయి గుప్పుమంటున్నట్లు సమాచారం. త్వరలో జరిగే న్యూఇయర్ వేడుకలకు గంజాయి ప్రధాన ఆకర్షణగా ఉండేలా రిసార్ట్‌ల నిర్వాహకులు ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటున్న ట్లు ప్రచారం జరుగుతున్నది. తనిఖీలు చేపట్టాల్సిన పోలీసులు వారు ఇచ్చే మామూళ్లకు ఆశ పడి అటువైపు వెళ్లడం లేదనే ఆరోపణలున్నాయి. రిసార్ట్‌లలో ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప లోపల ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయనేది తెలియకపోవడం గమనార్హం.
అమాయకులే లక్ష్యంగా..
డ్రగ్స్ ముఠాలు అమాయకులను ఎంచుకుని వారితో రైలు మార్గం ద్వారా గంజాయిని తరలిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో పట్టుబడిన వారిని రైల్వే పోలీసులు విచారించగా.. వారంతా ఎంతో కొంత డబ్బుకు ఆశపడి గంజాయిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించినట్లు తెలిసింది. తాజాగా మంగళవారం వికారాబాద్ జంక్షన్లో ఎల్టీటీ ఎక్‌ప్రెస్‌లో గంజాయిని తరలిస్తూ పట్టుబడిన వారిది కూడా ఇదే పరిస్థితి. వీరు ఒడిశా నుంచి 28 కిలోల గంజాయిని కొంత డబ్బుకు ఆశపడి ముంబైకి తరలిస్తూ పట్టుబడ్డారు. అయితే దాని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనేది తెలియడంలేదు. రైల్వే పోలీసులు పట్టుబడిన వారి నుంచి వివరాలు సేకరించి సూత్రధారులను అరెస్టు చేస్తేనే అక్రమ గంజా యి సరఫరా ఆగుతుందని పలువురు పేర్కొంటున్నారు.